News January 8, 2025

చలికాలం మంచి నిద్ర కోసం ఏం తినాలంటే?

image

చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.

Similar News

News January 20, 2025

షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. ఇద్దరు హీరోలకు గాయాలు

image

బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ గాయపడ్డారు. ‘మేరే హస్బెండ్‌ కి బీవి’ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ పైకప్పు కూలింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు BN తివారీ అదృష్టవశాత్తు నటులకు తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. అయితే షూటింగ్‌ల సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News January 20, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు

image

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో 642 పోస్టులకు దరఖాస్తు గడువు FEB 16తో ముగియనుంది. ఇందులో జూ.మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. టెన్త్, మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు. MTSకు 18-33ఏళ్లు, మిగతా పోస్టులకు 18-30Y వయసు ఉండాలి. జీతం MTSకు ₹16K-₹45K, జూ.మేనేజర్ ₹50K-₹1.60L, ఎగ్జిక్యూటివ్‌కు ₹30K-₹1.20L ఉంటుంది.
వెబ్‌సైట్: <>dfccil.com/<<>>

News January 20, 2025

వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

image

ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కదులుతున్న బైక్స్‌పై అత్యంత ఎత్తైన (20.4 ఫీట్) మానవ పిరమిడ్ నిర్మించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 7 బైక్‌లపై 40 మంది 2కి.మీ మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్‌‌ప్లే టీమ్‌ను ‘డేర్ డెవిల్స్’ అని పిలుస్తారు.