News May 22, 2024

20 ఓవర్లలో RCB స్కోర్ ఎంతంటే?

image

RRతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేశారు. విరాట్ (33), రజత్ పటీదార్ (34), లామ్రోర్ (32) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ 3, అశ్విన్ 2, బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Similar News

News April 19, 2026

అప్పులపై రాజధాని.. అలాగే మావిగన్ సరికాదు: విజయసాయిరెడ్డి

image

AP: రాష్ట్రానికి క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరమని YCP మాజీ MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘రూ.లక్షల కోట్లతో అమరావతి ప్రణాళిక ఉంది. అప్పులపై రాజధాని నమూనా సరికాదు. ఏకీకృత, దశలవారీ అభివృద్ధితో నిర్మించాలి. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాజధాని అనేది పరిపాలనకు నాడీ‌కేంద్రంగా ఉండాలి. మావిగన్ అంటూ పరిపాలనా విభజన ప్రమాదం. దీంతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది’ అని అన్నారు.

News April 19, 2026

భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

image

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.

News April 19, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.