News January 8, 2025
AAG ఏం చెబుతారు..?
TG: ACB విచారణకు లాయర్‌ను అనుమతించాలన్న <<15097073>>KTR<<>> పిటిషన్‌పై ఈ సాయంత్రం హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఇలాంటి దర్యాప్తును న్యాయవాది చూసే అవకాశం ఉందా? అని ACB తరఫు లాయర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. సాయంత్రం గం.4లోపు చెబుతామని దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన AAG కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు తిరిగి ప్రారంభమయ్యే విచారణలో ప్రభుత్వ కౌన్సిల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 9, 2025
కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న BRS నేతలు
TG: ACB విచారణ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్ సోదరి, MLC కవిత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆమెతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కాగా ఇవాళ ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
News January 9, 2025
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ అనంతపురంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కావాల్సి ఉంది. బాబీ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.
News January 9, 2025
సంక్రాంతి: ఫాస్టాగ్ చెక్ చేసుకోని బయల్దేరండి!
సంక్రాంతి పండక్కి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ఫాస్టాగ్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. కేవైసీ చేయించకపోయినా, మినిమం బ్యాలెన్స్ లేకున్నా బ్లాక్ లిస్టులో పడి, వాహనం ముందుకు కదలదు. అప్పటికప్పుడు రీఛార్జ్ చేసినా యాక్టివేట్ అయ్యేందుకు 15 నిమిషాల టైమ్ పడుతుంది.
>>SHARE IT