News January 8, 2025

AAG ఏం చెబుతారు..?

image

TG: ACB విచారణకు లాయర్‌ను అనుమతించాలన్న <<15097073>>KTR<<>> పిటిషన్‌పై ఈ సాయంత్రం హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఇలాంటి దర్యాప్తును న్యాయవాది చూసే అవకాశం ఉందా? అని ACB తరఫు లాయర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. సాయంత్రం గం.4లోపు చెబుతామని దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన AAG కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు తిరిగి ప్రారంభమయ్యే విచారణలో ప్రభుత్వ కౌన్సిల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News January 22, 2025

ఆటో డ్రైవర్‌కు రూ.50,000?

image

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు రూ.50 వేలు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న దొంగచేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన ఈ హీరోను ఆటో డ్రైవర్ సమయానికి ఆసుపత్రికి చేర్చారు.

News January 22, 2025

జేడీయూ U టర్న్.. బీజేపీతోనే ఉన్నామని ప్రకటన

image

మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వచ్చిన వార్తలపై జేడీయూ స్పందించింది. సెంట్రల్ లీడర్‌షిప్‌కు తెలియకుండానే లోకల్ చీఫ్ క్షేత్రిమయుమ్ బిరేన్ సొంతంగా గవర్నర్‌కు లేఖరాశారని వివరణ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యం కింద వెంటనే అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. తాము బీజేపీకే మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

News January 22, 2025

వక్ఫ్ బిల్లుకు కేరళ కాంగ్రెస్ ఎంపీ జార్జ్ మద్దతు

image

మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ‘INDIA’ సభ్యుడు, కేరళ కాంగ్రెస్ MP ఫ్రాన్సిస్ జార్జ్ మద్దతు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేంద్రం దీనిని పాస్ చేయాలన్నారు. నీతి, నిజాయతీకి తాను కట్టుబడతానని, వీటిని అనుసరించేవారికి తన పార్టీ సహకరిస్తుందని అన్నారు. మునంబమ్‌ భూమిని వక్ఫ్ లాగేసుకోవడంపై పోరాటం 100 రోజులకు చేరింది. దీనిపై క్రిస్టియన్ ట్రస్ట్ సర్వీస్ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.