News August 6, 2024

BNP-జ‌మాతే కూట‌మి వ‌స్తే ఏం జ‌రుగుతుంది?

image

బంగ్లాదేశ్‌లో సైన్యం స‌హ‌కారంతో BNP-జ‌మాతే కూట‌మి అధికారాన్ని చేప‌డితే భార‌త వ్య‌తిరేక శ‌క్తులు మ‌ళ్లీ త‌యార‌వుతాయ‌నే ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భార‌త్‌తో ఉన్న మైత్రి బంధం కార‌ణంగా షేక్ హ‌సీనా త‌న‌ హ‌యాంలో మ‌త‌ఛాంద‌స శ‌క్తుల‌పై ఉక్కుపాదం మోపారు. అయితే, ఇప్పుడు పాక్ పెంచి పోషించిన ఉగ్ర‌సంస్థ‌ల వ‌ల్ల స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌లు త‌ప్ప‌కపోవచ్చని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 6, 2025

టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

image

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.

News December 6, 2025

డబ్బులు రీఫండ్ చేస్తున్నాం: ఇండిగో

image

భారీగా విమానాల రద్దు నేపథ్యంలో <<18487498>>కేంద్రం<<>> సీరియస్ అవడంతో ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేస్తున్నామని ఇండిగో ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 5-15 వరకు జరిగిన బుకింగ్స్‌కు సంబంధించి క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ప్రశ్నలు అడగకూడదని పేర్కొంది. మరోవైపు ఫుల్ అమౌంట్ రీఫండ్ అవట్లేదని ప్రయాణికులు కామెంట్లు చేస్తున్నారు.

News December 6, 2025

ఫ్లైట్ల టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

image

ఇండిగో సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500km వరకు టికెట్ ధరను రూ.7,500గా నిర్ధారించింది. 500-1000kmకు రూ.12,000 వరకు, 1000-1500kmకు రూ.15,000 వరకు, 1500km పైన ఉంటే రూ.18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో మిగతా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే.