News August 6, 2024

BNP-జ‌మాతే కూట‌మి వ‌స్తే ఏం జ‌రుగుతుంది?

image

బంగ్లాదేశ్‌లో సైన్యం స‌హ‌కారంతో BNP-జ‌మాతే కూట‌మి అధికారాన్ని చేప‌డితే భార‌త వ్య‌తిరేక శ‌క్తులు మ‌ళ్లీ త‌యార‌వుతాయ‌నే ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భార‌త్‌తో ఉన్న మైత్రి బంధం కార‌ణంగా షేక్ హ‌సీనా త‌న‌ హ‌యాంలో మ‌త‌ఛాంద‌స శ‌క్తుల‌పై ఉక్కుపాదం మోపారు. అయితే, ఇప్పుడు పాక్ పెంచి పోషించిన ఉగ్ర‌సంస్థ‌ల వ‌ల్ల స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌లు త‌ప్ప‌కపోవచ్చని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News September 12, 2024

BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

News September 12, 2024

మదనపల్లె తహశీల్దార్ ఆఫీసులో సీఐడీ తనిఖీలు

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవాళ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. కోళ్లబైలు పరిధిలోని ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News September 12, 2024

చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లిన ఉత్తమ్ దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.