News March 16, 2024
విచారణలో కవిత ఏం చెప్పనున్నారు?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆమెకు కోర్టు కస్టడీ విధించడంతో ఈడీ కవితను విచారించనుంది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ఆరా తీయనుంది. గతంలో ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డితో ఆమెకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించనుంది. అయితే ఈడీ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News November 5, 2024
సరస్వతి పవర్ భూములు పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్
AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.
News November 5, 2024
వైసీపీవి శవ రాజకీయాలు: అనిత
AP: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మాజీ సీఎం జగన్ తన ఇంటి గేటు దగ్గర సిబ్బందికే రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినా కొన్ని నేరాలు జరుగుతుండటంతో బాధగా ఉంది. శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆమె హెచ్చరించారు.
News November 5, 2024
మదర్సాలు డిగ్రీలు ఇవ్వడం రాజ్యాంగవిరుద్ధం: సుప్రీంకోర్టు
UP <<14535006>>మదర్సా<<>> చట్టానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఒక విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫాజిల్, కామిల్ కింద డిగ్రీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇవి UG నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాయని వెల్లడించింది. మైనారిటీ స్టూడెంట్స్ బయటకెళ్లి గౌరవంగా బతికేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. ఈ చట్టాన్ని 2004లో ములాయం సింగ్ యాదవ్ తెచ్చారు.