News March 16, 2024
విచారణలో కవిత ఏం చెప్పనున్నారు?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆమెకు కోర్టు కస్టడీ విధించడంతో ఈడీ కవితను విచారించనుంది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ఆరా తీయనుంది. గతంలో ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డితో ఆమెకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించనుంది. అయితే ఈడీ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News February 11, 2026
మున్సి‘పోల్’కు వేళాయే!

TG: మున్సిపోల్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉ.7 గంటల నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఓటర్/ఆధార్/పాన్/డ్రైవింగ్ వంటి గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
News February 11, 2026
జగమంతా శివతత్వం

శివతత్వం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు. అది అంతటా నిండి ఉన్న అనంతమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ శివుడు ఉన్నాడు. కనిపించే పర్వతాలు, ఆకాశం నుంచి మనలో కలిగే ఆలోచనలు, కలల వరకు అన్నీ ఆ శివమయమే. శివం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మన ఊహకు అందేదీ ఆయనే! ఆ ఊహ చేసేదీ ఆయనే! శివతత్వం అంటే మౌనం, శూన్యం, సమస్తం. జగమంతా శివతత్వమే.
News February 11, 2026
విశాఖలో IPL మ్యాచులు?

IPL–2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ACA–VDCA స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక DCకి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం DCని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.


