News September 3, 2024
బ్రూనై, సింగపూర్‌లో మోదీ ఏం చేస్తారంటే..

బ్రూనై, సింగపూర్‌తో భారత దౌత్య సంబంధాల బలోపేతంపై దృష్టి సారిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ 2 దేశాల్లో పర్యటనపై ట్వీట్ చేశారు. ‘బ్రూనైతో దౌత్య బంధానికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. అక్కడ సుల్తాన్ హజీ హసనల్ను కలుస్తాను. సింగపూర్‌లో అధ్యక్షుడు థార్మన్ షణ్ముగరత్నం, PM లారెన్స్ వాంగ్, మంత్రులు లీ లూంగ్, గో చోక్ టాంగ్తో తయారీలో ఆధునికత, డిజిటైజేషన్, స్థిర అభివృద్ధిపై చర్చిస్తా’ అని ఆయన అన్నారు.
Similar News
News January 19, 2026
మహిళలపై నిందలు, డ్రెస్సింగ్‌పై రూల్స్ కరెక్ట్ కాదు: రేణుకా చౌదరి

TG: మంత్రులు, మహిళా అధికారులపై నిందలు మోపడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేత, MP రేణుకా చౌదరి అన్నారు. మహిళలను కించపరుస్తూ కొందరు SMలో పోస్టులు పెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. మహిళల డ్రెస్సింగ్ వివాదంపైనా ఆమె స్పందించారు. ‘ఆడవాళ్లు ఏం వేసుకోవాలో మీరెలా డిసైడ్ చేస్తారు. ఇలాంటి రూల్స్ మీ ఇంట్లో వాళ్లకి పెట్టుకోండి’ అని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు.
News January 19, 2026
కాంగ్రెస్, BRS, TDP సోషల్ మీడియా వార్.. ఫొటోలు వైరల్

TG: BRS దిమ్మెలను కూల్చివేయాలన్న CM రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. తెలంగాణ గడ్డపై గాంధీ భవన్, ఎన్టీఆర్ భవన్ లేకుండా చేస్తామంటూ BRS నేతలు పోస్టులు చేస్తున్నారు. వాటిని కూల్చివేసినట్లు AI జనరేటెడ్ ఫొటోలు క్రియేట్ చేశారు. అటు కాంగ్రెస్, TDP నేతలు సైతం BRS పార్టీని, తెలంగాణ భవన్‌ను నేలమట్టం చేస్తామంటూ AI ఫొటోలు పెడుతున్నారు.
News January 19, 2026
పశువుల్లో క్షయ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

పశువుల్లో క్షయ వ్యాధి మైకోబాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు శ్వాస వదిలినప్పుడు, తుమ్మినప్పుడు.. మైకోబాక్టీరియా గాలిలో కలిసిపోతుంది. ఈ బాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు, పాలను తాగడం వల్ల క్షయ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు బరువు తగ్గుతాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన జీవాలను ఇతర పశువుల నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.


