News September 3, 2024

బ్రూనై, సింగపూర్‌లో మోదీ ఏం చేస్తారంటే..

image

బ్రూనై, సింగపూర్‌తో భారత దౌత్య సంబంధాల బలోపేతంపై దృష్టి సారిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ 2 దేశాల్లో పర్యటనపై ట్వీట్ చేశారు. ‘బ్రూనైతో దౌత్య బంధానికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. అక్కడ సుల్తాన్ హజీ హసనల్‌ను కలుస్తాను. సింగపూర్‌లో అధ్యక్షుడు థార్మన్ షణ్ముగరత్నం, PM లారెన్స్ వాంగ్, మంత్రులు లీ లూంగ్, గో చోక్ టాంగ్‌తో తయారీలో ఆధునికత, డిజిటైజేషన్, స్థిర అభివృద్ధిపై చర్చిస్తా’ అని ఆయన అన్నారు.

Similar News

News September 7, 2024

దేశవాళీలో DRS.. బీసీసీఐ భేష్: అశ్విన్

image

ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బీసీసీఐ DRSను తీసుకురావడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. దీని వల్ల దేశవాళీ క్రికెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్లు సైతం తమ తప్పుల్ని తెలుసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికీ భుయ్ తాజాగా ఔటైన విధానాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు.

News September 7, 2024

భారీగా తగ్గిన ఐఫోన్ ధర

image

సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News September 7, 2024

ఆ మాటలతో అతని మెంటాలిటీ బయటపడింది: బజరంగ్ పునియా

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ వైఫల్యంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ <<14037088>>వ్యాఖ్యలతో<<>> అతని మెంటాలిటీ బయటపడిందని బజరంగ్ పునియా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓటమితో అతను సంతోషంగా ఉండొచ్చని విమర్శించారు. అది వినేశ్ మెడల్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలదని పేర్కొన్నారు. ఇలా ఓటమిని సెలబ్రేట్ చేసుకునేవారిని దేశ భక్తులంటారా? అని ప్రశ్నించారు.