News January 21, 2025

దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ..: అంబటి

image

AP: లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ.. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు’ అని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లోకేశ్‌ను Dy.CM చేయాలన్న పలువురి నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్ఠానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది.

Similar News

News January 21, 2025

మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 21, 2025

ఎంపీల కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష

image

AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్య‌సభ సభ్యుల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది.

News January 21, 2025

కుంభమేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!

image

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ NLB సర్వీసెస్‌ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, రవాణా, వైద్య శిబిరాల్లో లక్షల మందికి పని దొరికిందని చెప్పింది.