News April 23, 2025

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

image

AP: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. https://www.bse.ap.gov.in/ సైట్‌లో HM లాగిన్ ద్వారా ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. లేటు ఫీజు రూ.50తో మే 19 వరకు అప్లై చేయవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచి మే 1 వరకు అవకాశమిచ్చారు. రీకౌంటింగ్‌కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలి.

Similar News

News August 14, 2025

రజినీకాంత్ ‘కూలీ’ రివ్యూ&రేటింగ్

image

మిత్రుడి(సత్యరాజ్)ని ఎవరు, ఎందుకు చంపారో హీరో(రజినీకాంత్) తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ‘కూలీ’ స్టోరీ. ఎప్పటిలాగే రజినీ ఎలివేషన్స్ అభిమానులకు నచ్చుతాయి. యాక్షన్ సీన్లు, కొన్నిచోట్ల ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథ పెద్దది కావడంతో సెకండాఫ్‌ సాగదీతలా అనిపిస్తుంది. నాగార్జున పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అక్కడక్కడ డౌన్ కావడం మైనస్‌.
రేటింగ్-2.5/5

News August 14, 2025

ఈసారి జగన్‌నూ ఓడిస్తాం: మంత్రి సవిత

image

AP: పులివెందుల ZPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ‘పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఈ విజయానికి కష్టపడిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో జగన్‌నూ ఓడించి పులివెందుల కోటను బద్దలు కొడతాం’ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

News August 14, 2025

NTR, హృతిక్ ‘వార్-2’ రివ్యూ & రేటింగ్

image

శత్రువులుగా మారిన మిత్రులు విక్రమ్(NTR), కబీర్(హృతిక్) దేశం కోసం ఒక్కటై విదేశీ కుట్రను ఎలా తిప్పికొట్టారనేదే ‘వార్-2’ స్టోరీ. NTR, హృతిక్ స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. వార్-1 ఇంట్రో లేకపోవడం, ఊహించే సీన్లు, కొన్నిచోట్ల డబ్బింగ్‌ సమస్య, పూర్ VFX మైనస్‌. స్పై యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికే నచ్చుతుంది.
Way2News రేటింగ్-2.5/5