News December 15, 2024
గ్రూప్స్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఇవాళ, రేపు జరగబోయే గ్రూప్-2 పరీక్షకు 5,51,000 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. TGPSC కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, అభ్యర్థులు తమకు ఇష్టమైన బుక్స్ చదువుకోవచ్చని చెప్పారు. గ్రూప్-2 పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News November 20, 2025
ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

ఆన్లైన్లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.


