News August 27, 2024
పౌరస్వేచ్ఛ ప్రశ్నార్థకమైనప్పుడు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పౌరస్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారినప్పుడు కిందిస్థాయి కోర్టులు ముందస్తు బెయిల్ పిటిషన్లను స్వీకరించాలని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా లేదా తాత్కాలిక రక్షణ కల్పించేలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంది. కిందికోర్టులు వీటిని చేపట్టకపోతే హైకోర్టులపై భారం పెరుగుతుందని పేర్కొంది. స్థానిక నేత ప్రీ అరెస్టు బెయిల్‌పై థాణే జిల్లా కళ్యాణ్ కోర్టు నిర్ణయం ఆలస్యమవ్వడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News September 20, 2024
YCPకి సామినేని ఉదయభాను రాజీనామా
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.
News September 20, 2024
100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం: వైసీపీ
AP: కూటమి ప్రభుత్వం గత 100 రోజుల్లో ప్రజలకు చేసింది ‘సున్నా’ అని వైసీపీ విమర్శించింది. ‘సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. దాడులు, దౌర్జన్యాలతో కక్షసాధింపులకే పరిమితం అయింది. ఈ 100 రోజుల్లో 50 మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రావణకాష్ఠంగా మారింది. మంచి ప్రభుత్వమంటూ ప్రచారం తప్ప ఈ 100 రోజుల్లో ప్రజలకు ఒరిగిందేమిటి?’ అని ట్వీట్ చేసింది.
News September 20, 2024
టీటీడీ ఈవోకు చంద్రబాబు ఆదేశం
AP: టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.