News June 13, 2024
తొలి సంతకం ట్రెండ్ ఎప్పుడు మొదలైంది?
ఈరోజు AP CM చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. అయితే 2004 మే 14న LB స్టేడియంలో ఉమ్మడి AP CMగా YSR ప్రమాణ స్వీకారం చేసి ఆ వేదికపైనే రైతులకు ఫ్రీ కరెంట్‌పై తొలి సంతకం చేశారు. అప్పట్నుంచి ఈ ‘తొలి సంతకం’ ట్రెండ్ నడుస్తోంది. అంతకు ముందు ఇప్పుడున్నంత క్రేజ్ ఉండేది కాదు. కాగా మొన్న PM మోదీ ‘PM కిసాన్ నిధి’పై, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు.
Similar News
News September 21, 2024
జానీ మాస్టర్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టనున్న బాధితులు?
మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన నేపథ్యంలో ఆయన బాధితులు మరింత మంది బయటికి రానున్నట్లు సమాచారం. జానీ చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విషయాలు వెల్లడించనున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఆయన చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. కాగా నిందితుడు జానీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
News September 21, 2024
ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS
AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో CBSE సిలబస్ అమలు చేయడానికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. దీనివల్ల మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సిలబస్ తగ్గనుంది. అలాగే గణితంలో ప్రస్తుతం ఉన్న 2 పేపర్లను ఒకటిగా చేయాలా? అలాగే కొనసాగించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ ఇప్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
News September 21, 2024
ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి దసరాకు గ్లింప్స్?
హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం మధురైలో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రభాస్ పాల్గొనడం లేదు. రెండో షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని మూవీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం నుంచి దసరాకు ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారని సమాచారం.