News June 13, 2024

ఫెదరర్‌పై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

image

టెన్నిస్ స్టార్ ప్లేయర్లలో ఒకరైన రోజర్ ఫెదరర్‌పై డాక్యుమెంటరీని రూపొందించారు. ‘‘ఫెదరర్‌’ పేరుతో రూపొందిన డాక్యుమెంటరీ ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. దీనికి ‘12 ఫైనల్ డేస్’ అని క్యాప్షన్ చేసింది. తన కెరీర్‌లో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఫెదరర్ 2022లో ఆటకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Similar News

News November 10, 2025

TODAY HEADLINES

image

➧ కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్
➧ అనారోగ్యమే అసలైన పేదరికం: సీఎం చంద్రబాబు
➧ ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
➧ వారంలో TG TET నోటిఫికేషన్?
➧ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి.. బిహార్ ప్రచారంలో లోకేశ్
➧ ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP
➧ డిసెంబర్ 15న IPL వేలం!

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.

News November 10, 2025

అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

image

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.