News June 13, 2024
ఫెదరర్‌పై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టెన్నిస్ స్టార్ ప్లేయర్లలో ఒకరైన రోజర్ ఫెదరర్‌పై డాక్యుమెంటరీని రూపొందించారు. ‘‘ఫెదరర్’ పేరుతో రూపొందిన డాక్యుమెంటరీ ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. దీనికి ‘12 ఫైనల్ డేస్’ అని క్యాప్షన్ చేసింది. తన కెరీర్‌లో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఫెదరర్ 2022లో ఆటకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
Similar News
News September 17, 2024
కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..
TG: కొత్త రేషన్ కార్డుల <<14116390>>దరఖాస్తులకు<<>> వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. అయితే AP, TN, KA, గుజరాత్‌లో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
News September 17, 2024
రాహుల్ గాంధీది జిన్నా మైండ్‌సెట్: పెట్రోలియం మంత్రి
దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలనుకుంటున్న రాహుల్ గాంధీకి జిన్నా తరహా మైండ్‌సెట్ ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ USలో విమర్శించారు. ‘భారత్‌లో రాహుల్ సిక్కుల గురించి మాట్లాడరు. ఎవరి హయాంలో, ఎందుకు వారిపై ఊచకోత జరిగిందో ఆయన అంతర్మథనం చేసుకోవాలి. కోరుకున్నది దక్కాలి లేదా నాశనమవ్వాలన్న జిన్నా వైఖరే ఆయనకుంది. ఓ పద్ధతి ప్రకారం ఆయన సిక్కులపై కుటిల యత్నానికి పాల్పడుతున్నారు’ అని అన్నారు.
News September 17, 2024
వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!
TG: NEP-2020లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యావిధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని చూస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్‌వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు 3,4,5 క్లాసులు, ఆపైన 6,7,8 తరగతులు చదవాలి. చివరి నాలుగేళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతుల్లో చేరాలి.