News December 18, 2024
‘తండేల్’ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?
హీరో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తోన్న ‘తండేల్’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీలోని సెకండ్ సింగిల్ ‘శివ శక్తి’ సాంగ్‌ను ఈనెల 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కాశీలో గ్రాండ్‌గా సాంగ్ లాంచ్ చేస్తామని తెలిపారు. కాగా ‘తండేల్’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
Similar News
News January 22, 2025
IND-ENG మ్యాచ్.. పిచ్ రిపోర్ట్
ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 జరిగే కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. బౌండరీ చిన్నగా ఉండటంతో పరుగుల వరద పారనుంది. వాతావరణం విషయానికొస్తే రాత్రి పొగమంచు కురుస్తుంది. దీనివల్ల బంతి త్వరగా తడిగా మారి బౌలర్లకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఇది బ్యాటర్లకు ప్లస్ కానుంది. ఇక ఈడెన్ గార్డెన్స్ వద్ద వర్షం కురిసే అవకాశం లేదని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.
News January 22, 2025
సమంత ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా తెలుగు సినిమాల్లో నటించట్లేదు. హిందీలోనూ అదే పరిస్థితి. ఇటు మీడియాకూ ఆమె దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె WPBL చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇటీవల ఆమె చికున్ గున్యా నుంచి కోలుకున్నారు. ఆమె చాలా సన్నపడ్డారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
News January 22, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న అఫ్జల్‌గంజ్ కాల్పుల దొంగలు
కర్ణాటకలోని బీదర్, HYDలోని అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్‌పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్‌కు, లారీలో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.