News December 9, 2024
‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్

INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.
Similar News
News January 7, 2026
పాలమూరు: ‘నో హెల్మెట్.. నో ఫ్యూయల్’

“నో హెల్మెట్ – నో ఫ్యూయల్” అనే నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి తెలిపారు. హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంక్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంక్ యజమానులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

VZM: సంక్రాంతి పండగ కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు

సంక్రాంతిని పురస్కరించుకొని విజయనగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు RTC ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి భీమవరం, కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, విజయవాడ వరకు సాదారణ ఛార్జీలతోనే ఈ బస్సులను నడుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పార్వతీపురం, విశాఖ, శ్రీకాకుళం, రాజాం, ఎస్.కోటకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు వేస్తామన్నారు.