News August 3, 2024

వన్డే హిస్టరీలో తొలిసారి సూపర్ ఓవర్ ఎప్పుడంటే?

image

2019 ODI WC ఫైనల్‌లో ENG-NZ టీమ్స్ 241 స్కోర్ చేయడంతో టైగా ముగిసింది. దీంతో చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులోనూ ఇరు జట్లూ 15 స్కోర్ చేయగా, బౌండరీల ఆధారంగా ENGను విజేతగా ప్రకటించారు. తర్వాత 2020లో జింబాబ్వే-పాక్ వన్డే టై కాగా, ప్రత్యేక పరిస్థితుల్లో <<13765321>>సూపర్ ఓవర్<<>>(విజేత ZIM) నిర్వహించారు. 2023 WC క్వాలిఫయర్ దశలో విండీస్-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్(విజేత NED) జరిగింది.

Similar News

News September 14, 2024

కోహ్లీతో పోరాటం కోసం ఎదురుచూస్తున్నా: స్టార్క్

image

ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీకి బౌలింగ్ వేసేందుకు ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నారు. విరాట్‌తో పోరాటం బాగుంటుందన్నారు. ‘మేమిద్దరం ఒకరితో ఒకరు చాలా క్రికెట్ ఆడాం. మా పోరాటంలో ఉండే మజాను ఆస్వాదిస్తుంటాను. తను నాపై రన్స్ చేశారు. నేనూ ఆయన్ను ఔట్ చేశాను. ఈసారి పోరు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News September 14, 2024

గుజరాత్‌లో తీవ్ర విషాదం

image

గుజరాత్‌లోని దేగాం తాలూకాలో జరిగిన వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి చనిపోయారు. వస్నా సోగ్తికి చెందిన కొందరు యువకులు గణేషుడిని నిమజ్జనం చేసేందుకు మాషో నదికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు నీటిలో దూకి మునిగిపోయారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

News September 14, 2024

సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: హైదరాబాద్ మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
హిందీ భాషా దినోత్సవం