News October 29, 2024

గ్రూప్-1 ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. దీంతో ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ ఫోకస్ చేసింది. ఇంటర్వ్యూలు లేకపోవడంతో రాతపరీక్షలో వచ్చిన మార్కులే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా వాల్యుయేషన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. దీంతో ఫలితాలకు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫలితాలు హైకోర్టు తీర్పునకు లోబడే ఉండొచ్చని తెలుస్తోంది.

Similar News

News November 14, 2024

రేపే బాలయ్య మూవీ టీజర్.. నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి రేపు టైటిల్ & టీజర్‌ విడుదలవనుంది. ఉదయం 10.24 గంటలకే టీజర్ వీడియో రానుండటంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘రేపు వచ్చే అదిరిపోయే BGM కోసం సిద్ధంగా ఉండండి. బాలయ్య బాబు సినిమాలకు తమన్ ఎందుకు మ్యూజిక్ అందించాలో మీకే తెలుస్తుంది’ అని చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది.

News November 14, 2024

పాక్‌కు షాక్.. భారత్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ విధానానికి అంగీకరించకపోతే ఈ టోర్నీ భారత్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్‌‌కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. ఈ విషయంపై ICC తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CT పాక్‌లో జరగాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఇండియా ససేమిరా అంటోంది.

News November 14, 2024

Delhi Pollution: ప్రైమరీ స్కూళ్లు బంద్

image

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయుల్ని త‌గ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ క‌మిష‌న్ స్టేజ్‌-3 ప్ర‌ణాళికను శుక్రవారం నుంచి అమల్లోకి తేనుంది. దీని ప్రకారం ఎల‌క్ట్రిక్‌, CNG, BS-6 మినహా ఇంటర్ స్టేట్ బ‌స్సులు తిర‌గ‌డంపై నిషేధం. BS-3 పెట్రోల్‌, BS- 4 డీజిల్ ఫోర్ వీల‌ర్స్‌పై నిషేధం. ప్రజా రవాణా వాడాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లను మూసివేసి Online Classes నిర్వహించాలని CM ఆతిశీ ఆదేశించారు.