News August 3, 2024
నాగార్జున సాగర్ ఎప్పుడు నిండుతుందంటే?

ఏపీ, తెలంగాణ సాగునీటి అవసరాలకు ముఖ్యమైన నాగార్జున సాగర్ జలాశయం మరో 2, 3 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 4.94 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 565 అడుగులుగా ఉంది. సాగర్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 244 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కాలువల ద్వారా 29వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
Similar News
News November 21, 2025
ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 21, 2025
స్వీట్ కార్న్.. కోత సమయాన్ని ఎలా గుర్తించాలి?

తీపి మొక్కజొన్న కండెలపై కొంచెం ఎండిన పీచు, కండెపై బిగుతుగా ఉన్న ఆకు పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గింజపై గిల్లితే పాలు కారతాయి. ఈ సమయంలో కండెలను కోయడం మంచిది. కోత ఆలస్యమైతే గింజలోని తీపిదనం తగ్గుతుంది. తీపి మొక్కజొన్నను దఫదఫాలుగా విత్తుకుంటే పంట ఒకేసారి కోతకు వచ్చి వృథా కాకుండా పలు దఫాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


