News August 3, 2024
నాగార్జున సాగర్ ఎప్పుడు నిండుతుందంటే?
ఏపీ, తెలంగాణ సాగునీటి అవసరాలకు ముఖ్యమైన నాగార్జున సాగర్ జలాశయం మరో 2, 3 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 4.94 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 565 అడుగులుగా ఉంది. సాగర్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 244 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కాలువల ద్వారా 29వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
Similar News
News September 19, 2024
కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు
TG: కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడింది. APలోని ప.గో.లో ఆయనపై కేసు నమోదవ్వగా తెలంగాణ దేవాదాయశాఖ చర్యలకు దిగింది. సీతారామకు కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకుని తాడేపల్లి గూడెంకు చెందిన యువతితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో తన పోలికలతో వారసుడు కావాలని కోడలిని వేధించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.
News September 19, 2024
‘దేవర’ రన్ టైమ్ ఎంతంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.
News September 19, 2024
బంగ్లాతో తొలి టెస్టు: మూడు వికెట్లు కోల్పోయిన భారత్
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత టాపార్డార్ తడబడింది. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ ధాటికి 34 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన గిల్ 8 బంతులాడి ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. అనంతరం కింగ్ కోహ్లీ 6 పరుగులే చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ యశస్వి(17), పంత్(0) ఉన్నారు.