News October 21, 2024

శ్రీవిష్ణు ‘స్వాగ్’ ఓటీటీలోకి ఎప్పుడంటే?

image

శ్రీవిష్ణు, హసిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘స్వాగ్’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 5 పాత్రల్లో శ్రీవిష్ణు కనిపించగా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా వచ్చే నెల 4న ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 13, 2024

కుట్రపూరితంగానే కలెక్టర్‌పై దాడి: భట్టి

image

TG: కుట్రపూరితంగానే కలెక్టర్‌పై BRS శ్రేణులు దాడి చేశాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని Dy CM భట్టి విక్రమార్క ఆరోపించారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ‘పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూమి కోల్పోతున్నవారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం’ అని వెల్లడించారు.

News November 13, 2024

ఏపీ శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేశారు: జగన్

image

APకి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు తమపై తప్పుడు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. ‘ఓ పద్ధతి ప్రకారం మా ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారు. పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని అబద్ధాలు చెప్పారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని ముందు చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత పవన్, పురందీశ్వరి ఆయనకు వత్తాసు పలికారు. గవర్నర్‌తోనూ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు’ అని జగన్ మండిపడ్డారు.

News November 13, 2024

కాసేపట్లో కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డి

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లే దారిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో నరేందర్ కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.