News May 4, 2024

‘మేక్ ఇన్ ఇండియా’ తొలి C295 ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్పుడు వస్తుందంటే?

image

భారత వాయుసేనను మరింత పటిష్ఠం చేసేందుకు ఎయిర్ బస్ <<11629525>>C295<<>> విమానాలను కేంద్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రెండో C295 ఎయిర్‌క్రాఫ్ట్‌ను వాయుసేనకు అందజేసినట్లు తయారీ సంస్థ ఎయిర్‌బస్ ట్వీట్ చేసింది. మొత్తం 56 విమానాల్లో ఒప్పందం ప్రకారం 40 విమానాలను వడోదరాలో తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 సెప్టెంబర్ కల్లా ‘మేక్ ఇన్ ఇండియా’ తొలి C295 ఎయిర్‌క్రాఫ్ట్ వస్తుందని తెలిపింది.

Similar News

News November 9, 2025

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.

News November 9, 2025

ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి: లోకేశ్

image

బిహార్ అభివృద్ధి కోసం NDAను మరోసారి గెలిపించాలని మంత్రి లోకేశ్ ఓటర్లను కోరారు. పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. గతంలో APలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నీ పారిపోయాయని తెలిపారు. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బిహార్ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు.

News November 9, 2025

కేటీఆర్ ప్రచారం శ్రీలీల ఐటమ్ సాంగ్‌ను గుర్తు తెస్తోంది: రేవంత్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని CM రేవంత్ అన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి సినిమా మధ్యలో ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి. వాటిని కేటీఆర్ ఆదర్శంగా తీసుకొని మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌ గుర్తొస్తోంది’ అని సెటైర్ వేశారు.