News May 4, 2024
‘మేక్ ఇన్ ఇండియా’ తొలి C295 ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్పుడు వస్తుందంటే?
భారత వాయుసేనను మరింత పటిష్ఠం చేసేందుకు ఎయిర్ బస్ <<11629525>>C295<<>> విమానాలను కేంద్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రెండో C295 ఎయిర్‌క్రాఫ్ట్‌ను వాయుసేనకు అందజేసినట్లు తయారీ సంస్థ ఎయిర్‌బస్ ట్వీట్ చేసింది. మొత్తం 56 విమానాల్లో ఒప్పందం ప్రకారం 40 విమానాలను వడోదరాలో తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 సెప్టెంబర్ కల్లా ‘మేక్ ఇన్ ఇండియా’ తొలి C295 ఎయిర్‌క్రాఫ్ట్ వస్తుందని తెలిపింది.
Similar News
News November 3, 2024
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం
ఇండిగో, ఎయిరిండియా విమానాలకు మరో సారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నై-హైదరాబాద్ ఎయిరిండియా, హైదరాబాద్-పుణే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు గోవా-కోల్‌కతా విమానానికి ఇదే తరహా బెదిరింపులు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
News November 3, 2024
‘కాంతార-2’ కోసం రంగంలోకి RRR యాక్షన్ కొరియోగ్రాఫర్
కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పని చేయనున్నారు. ‘కాంతార’కు మించి సినిమాటిక్ క్వాలిటీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే టోడర్‌ను తీసుకున్నారు రిషబ్. RRRలో యాక్షన్స్ సీక్వెన్స్‌తో ఆకట్టుకున్న టోడర్ కాంతారను ఎలా చూపిస్తారో చూడాలి మరి.
News November 3, 2024
ALERT.. పొంచి ఉన్న మరో వాయుగుండం
AP: ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., బాపట్ల, ప్రకాశంతో పాటు రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.