News May 3, 2024
మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే?

మహేశ్ బాబు-రాజమౌళి చిత్ర షూటింగ్ ఆగస్టు/సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ చెప్పారు. రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా.. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తన కోసం సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పాత్రకు తగ్గట్లు మహేశ్ తనని తాను మలుచుకుంటున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
టుడే టాప్ స్టోరీస్

* AP CM చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
* కేంద్ర మాజీమంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో కన్నుమూత
* మెస్సీ టీమ్‌పై గెలిచిన CM రేవంత్ జట్టు
* ₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి
* సంక్రాంతికి SEC నుంచి ప్రత్యేక రైళ్లు.. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్
* ₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్
* దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం
News December 14, 2025
Kerala: కమ్యూనిస్టులకు ఎదురుదెబ్బ!

కేరళ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా కనిపించింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని అధికార LDFకు ఈ ఫలితాలు షాకిచ్చాయి. UDF(కాంగ్రెస్) బలం పుంజుకుంది. 6 కార్పొరేషన్లలో 4, 86 మున్సిపాలిటీల్లో 54, 941 పంచాయతీల్లో 504 స్థానాలను గెలుచుకుంది. LDFకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు <<18552178>>తిరువనంతపురం<<>> కార్పొరేషన్‌లో NDA గెలిచింది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు షాక్ తప్పదనే చర్చ సాగుతోంది.
News December 14, 2025
హైదరాబాద్‌లో మెస్సీ.. PHOTO GALLERY

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.


