News December 24, 2024

కొత్త Income Tax చట్టం వచ్చేదెప్పుడంటే..

image

సరికొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చేందుకు ఏడాది సమయం పట్టొచ్చని సమాచారం. 2025 బడ్జెట్ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలిసింది. ప్రస్తుత IT చట్టంలో 23 ఛాప్టర్లు ఉన్నాయి. వాటన్నిటినీ సింప్లిఫై చేయడం అంత సులభం కాదు. కొత్త నిబంధనలు, అనుబంధ వ్యవస్థలు, ఫార్ములేషన్స్‌ను పక్కాగా పరీక్షించాల్సి ఉంటుంది. బ్యాక్‌ఎండ్ సిస్టమ్స్ అప్‌గ్రెడేషనూ ముఖ్యమే. అందుకే కేంద్రం మరింత సమయం తీసుకుంటోంది.

Similar News

News January 23, 2025

‘త్వరగా రావే.. టైమ్ అవుతోంది’

image

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితి ఇది. చాలా స్కూళ్లలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంటోంది. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. HYDలోని ఓ పాఠశాలలోని పరిస్థితి తెలియజేస్తూ ఓ జర్నలిస్టు తీసిన ఫొటో వైరలవుతోంది. దీనిపై మీ కామెంట్?

News January 23, 2025

ఈ కారణాలతోనే రిజైన్ చేస్తుంటారు: గోయెంకా

image

ఉద్యోగుల రాజీనామాలకు గల కారణాలను బిజినెస్‌మ్యాన్ హర్షా గోయెంకా తెలిపారు. రీజన్స్ ఇవేనంటూ ఓ ఫొటో షేర్ చేశారు. ‘సరైన మేనేజర్ లేకపోవడం, సమానంగా చూడకపోవడం, గుర్తింపు లేకపోవడం, తక్కువ జీతం ఇవ్వడం, విష సంస్కృతి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, ఎదిగేందుకు తక్కువ ఆప్షన్స్ ఉండటం, ఆఫీస్‌లో జరిగే రాజకీయాలకు బలవడం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, వర్క్ లోడ్ ఎక్కువ చేయడం వంటివి కారణాలు కావొచ్చు’ అని తెలిపారు.

News January 23, 2025

కుక్కర్‌లో బాడీ పార్ట్‌లు.. ట్విస్ట్?

image

భార్యను చంపి బాడీ పార్ట్‌లను <<15227723>>కుక్కర్‌లో ఉడికించిన కేసులో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్‌లో ఓ మహిళ ఫొటోలు గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.