News January 3, 2025
వారికి నియామక పత్రాలు ఎప్పుడిస్తారు?: RSP

TG: జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్-4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటని, ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉష్ణోగ్రతలిలా..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంలలో 10.9℃ల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 10.7℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్లో 11℃, జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారంలో 11℃ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 31, 2025
తలరాతను మార్చిన చదువు.. తల్లిదండ్రులకు అద్భుత బహుమతి

మహారాష్ట్రలో గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టి IPS ఆఫీసర్ అయిన బర్దేవ్ సిద్ధప్ప గుర్తున్నారా? ఇల్లు కూడా లేని ఆయన బీటెక్ పూర్తి చేసి 2024లో యూపీఎస్సీ ఫలితాల్లో IPSగా ఎంపికయ్యారు. ఆ కమ్యూనిటీ నుంచి IPS అయిన తొలి వ్యక్తిగా రికార్డు అందుకున్నారు. తాజాగా తన తల్లిదండ్రులను, ఆత్మీయులను విమానం ఎక్కించారు. విమానం గురించి చిన్నప్పుడు కలలు కనేవాడినని, ఇప్పుడు నిజమైందని సిద్ధప్ప ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
News December 31, 2025
వారెన్ బఫెట్ వీడ్కోలు: వ్యాపార దిగ్గజాలు నేర్చుకున్న పాఠాలివే!

బెర్క్షైర్ హాత్వే CEOగా వారెన్ బఫెట్ తన సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో ముగించనున్నారు. 95 ఏళ్ల వయసున్న ఈ పెట్టుబడి దిగ్గజం నుంచి నేర్చుకున్న పాఠాలను వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పడం, ఓపికతో లాంగ్టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బఫెట్ ప్రత్యేకత. డబ్బు కంటే నైతికతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సంపద మనిషిని బందీ చేయకూడదని నమ్మి.. తన ఆస్తిని దానధర్మాలకు కేటాయించారు.


