News April 27, 2024
ఈ పోలవరం ఎప్పుడు పూర్తయ్యేనో?
తెలుగు ప్రజల చిరకాల కోరిక పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తైతే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు, చాలా ప్రాంతాలకు తాగు నీరు అందుతుంది. విద్యుదుత్పత్తి, జలరవాణా, చేపల పెంపకానికి కల్పతరువులా మారుతుంది. ఇంతటి ప్రాముఖ్యమైన ఈ ప్రాజెక్టు 2004లో ప్రారంభమైంది. 2015లో జాతీయ హోదా వచ్చినా కొలిక్కి రాలేదు. ఈ ఎన్నికల వేళ కూడా పార్టీల ప్రధాన హామీగా ఉంటున్న ఈ ప్రాజెక్టు సాకారమయ్యేదెన్నడో?
Similar News
News November 5, 2024
NRIలు ఇకపై UPIలో రోజుకు ₹లక్ష పంపొచ్చు!
NRE/NRO ఖాతాలు ఉన్న NRIలు UPI ద్వారా రోజుకు ₹లక్ష వరకూ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని NPCI కల్పించింది. ఇందుకోసం యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌కు లింకై ఉన్న ఇంటర్నేషన్ ఫోన్ నంబర్‌తో ఏదైనా యూపీఐ ఎనేబుల్డ్ యాప్‌లో లాగిన్ చేసుకోవాలి. US, కెనడా, UK, UAE, సింగపూర్, AUS వంటి దేశాల్లో ఉన్న వారికి ఇది అందుబాటులో ఉంది. HDFC, ICICI, IDFC, AXIS, DBS వంటి బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ఈ సేవలను వాడుకోవచ్చు.
News November 5, 2024
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీన్ రిపీట్
తమిళనాడులోని మింజూర్ రైల్వేస్టేషన్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ సీన్ రిపీటైంది. నెల్లూరుకు చెందిన తండ్రీ కూతురు.. సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ ఓ మహిళను చంపి సూట్‌కేసులో కుక్కి రైల్వేస్టేషన్‌లో విసిరేశారు. దీనిని ఓ కానిస్టేబుల్ గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో కూడా ఇలాగే కొంతమందిని హత్య చేసి సూట్‌కేసుల్లో కుక్కి పట్టాల పక్కన పడేసేవారు.
News November 5, 2024
ఆడబిడ్డల పరామర్శకు వెళ్లండి పవన్: అంబటి
AP: పల్నాడు జిల్లాలో జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలనకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్లాల్సింది. బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు!’ అని రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.