News February 1, 2025
కేంద్రానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి?

నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రానికి ఆదాయం ఏ రూపంలో ఎంత వస్తోందో ఓసారి చూద్దాం.
* అప్పులు, ఇతర మార్గాలు: 24%
* ఇన్‌కమ్ ట్యాక్స్: 22%
* జీఎస్టీ, ఇతర పన్నులు: 18%
* కార్పొరేషన్ ట్యాక్స్: 17%
* పన్నేతర ఆదాయం: 9% * కేంద్ర ఎక్సైజ్ పన్ను: 5
* కస్టమ్స్ పన్ను: 4% * రుణేతర పెట్టుబడులు: 1%
Similar News
News February 10, 2025
రాజ్ ఠాక్రేతో ఫడణవీస్ భేటీ

MNS చీఫ్ రాజ్‌ఠాక్రేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భేటీ అయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇద్దరు నేతలు సమావేశమవడం ఇదే తొలిసారి. MHలో కొద్దిరోజుల్లో స్థానికసంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి మద్దతిచ్చిన MNS తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఖాతా తెరవలేకపోయింది.
News February 10, 2025
నాన్నా.. నువ్వు చనిపోతున్నావా అని అడిగాడు: సైఫ్

తనపై దాడి జరిగినప్పుడు ఇంట్లో పరిస్థితిపై సైఫ్ అలీఖాన్ వివరించారు. ‘చిన్నకొడుకు జెహ్ రూమ్‌లోకి ప్రవేశించిన దుండగుడిని అడ్డుకోగా నాపై కత్తితో దాడి చేశాడు. వెంటనే కరీనా, తైమూర్ వచ్చారు. నాన్న నువ్వు చనిపోతున్నావా అని తైమూర్ అమాయకంగా అడగ్గా, లేదని చెప్పా. కరీనా కొందరికి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు వారు చాలా భయపడ్డారు. అనంతరం తైమూర్‌తో కలిసి ఆస్పత్రికెళ్లా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News February 10, 2025
పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ వాయిదా

TG: ఫిరాయింపు <<15413173>>ఎమ్మెల్యేలపై<<>> అనర్హత వేటు వేయాలని KTRతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకరు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. అనంతరం విచారణను ఈ నెల 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.