News January 22, 2025
మనుషులతో రోబోల మారథాన్.. ఎక్కడంటే?

ప్రపంచంలోనే తొలిసారి మనుషులతో కలిసి హ్యూమనాయిడ్ రోబోల మారథాన్‌కు చైనా సిద్ధమైంది. ఏప్రిల్‌లో బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో 21కి.మీ. మేర డజన్ల కొద్దీ రోబోలతో పాటు 12K అథ్లెట్లు పోటీ పడనున్నారు. తొలి 3స్థానాల్లో నిలిచిన అథ్లెట్ లేదా రోబోలకు బహుమతులిస్తారు. చైనాలో వృద్ధాప్య జనాభా పెరిగి శ్రామిక శక్తి తగ్గింది. అందుకే హ్యమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేస్తుండగా, ఇందులో భాగంగానే మారథాన్ నిర్వహిస్తోంది.
Similar News
News February 10, 2025
ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్ సందిగ్ధం

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.
News February 10, 2025
జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

YCP అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మార్చి 6కు వాయిదా పడింది. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తరఫు లాయర్లు సమయం కోరారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News February 10, 2025
పెళ్లి చేసుకున్న నటి

మలయాళీ నటి పార్వతి నాయర్ పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఆమె వివాహమాడారు. ఈ క్రమంలో ఆ జంటకు విషెస్ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాపిన్స్, నిమిరిందు నిల్, ఎన్నై అరిందుల్(ఎంతవాడు గానీ), ఉత్తమ విలన్, ఓవర్ టేక్ వంటి సినిమాల్లో ఆమె నటించారు.