News May 11, 2024

మే 13న పోలింగ్ ఎక్కడెక్కడ?

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏపీ(25 MP సీట్లు), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), తెలంగాణ(17), యూపీ(13), ప.బెంగాల్(8), జమ్ముకశ్మీర్(1) ఈ 4వ విడతలో ఉన్నాయి. మే 20, 25, జూన్ 1న తదుపరి విడతల పోలింగ్ ఉంటుంది.

Similar News

News February 18, 2025

బూతులు మాట్లాడేందుకు లైసెన్స్ ఉందా: సుప్రీంకోర్టు ఆగ్రహం

image

పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్ కామెంట్లు చేసిన <<15458454>>రణ్‌వీర్<<>> అలహాబాదియపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. ‘అతడు తల్లిదండ్రులను అవమానిస్తున్నాడు. అతడి బుర్రలోనే ఏదో బురద ఉంది. ఇలాంటి వ్యక్తికి మేమెందుకు ఫేవర్ చేయాలి? అతడి ప్రోగ్రాముల్లో అంతా అసభ్యతే కనిపిస్తోంది. ఇలాంటి చెత్త లాంగ్వేజ్ మాట్లాడేందుకు మీకేమైనా లైసెన్స్ ఉందా? పాపులారిటీ రాగానే ఏదైనా మాట్లాడొచ్చని భావిస్తున్నారు’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

News February 18, 2025

‘తుని’లో వివాదమేంటి?

image

AP: తుని మున్సిపల్ <<15498884>>వైస్ ఛైర్మన్<<>> ఎన్నిక నేపథ్యంలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. గత ఎన్నికల్లో 30 వార్డులను YCP గెలుచుకుంది. ఒకరు మృతి చెందగా, మరొకరు రాజీనామా చేశారు. ఇటీవల 10 మంది కౌన్సిలర్లు TDPలో చేరారు. మరో నలుగురి కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందంటూ YCP కౌన్సిలర్లను క్యాంప్‌కు తరలించి చలో తునికి పిలుపునిచ్చింది. పోటీగా TDP కార్యకర్తలు అక్కడికి రావడంతో రచ్చ చెలరేగింది.

News February 18, 2025

ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌హసీనా

image

ఆవామీలీగ్ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ఆపార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలో ఎంతోమంది కళాకారులు, పోలీసులు, కార్యకర్తలు హత్యకు గురైనా యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

error: Content is protected !!