News August 17, 2024
మీ ఆధార్‌కు ఏ ఫోన్ నంబర్ ఇచ్చారు?

☞ UIDAI సైటులో మై ఆధార్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి
☞ అనంతరం వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి
☞ ఆ తర్వాత ఆధార్, మొబైల్ నంబర్, క్యాప్చా టైప్ చేసి, ఎంటర్పై క్లిక్ చేయాలి
☞ ఎంటర్ చేసిన నంబర్ ఆధార్‌కు లింకై ఉంటే అయినట్లు సందేశం వస్తుంది. లేదంటే లింక్ కాలేదని డిస్ప్లే అవుతుంది.
☞ ఇలా మీ వద్ద ఉన్న నంబర్లలో దేనికి ఆధార్ కార్డ్ లింకై ఉందో తెలుసుకోవచ్చు
Similar News
News January 15, 2026
పిండివంటలతో ఇంటింటా ఘుమఘుమలు

సంక్రాంతి పండుగ అనగానే కోడి పందేలు, గొబ్బెమ్మలతో పాటు ఘుమఘుమలాడే పిండివంటలు గుర్తొస్తాయి. సొంతూళ్లకు వచ్చిన పిల్లలు, అల్లుళ్లు, మనవళ్ల కోసం ఇళ్లలో అరిసెలు, సకినాలు, మురుకులు, గారెలు, సున్నుండలు వంటి వంటకాలను తయారు చేస్తారు. బెల్లం, నువ్వులు, బియ్యం పిండితో చేసిన తీపి వంటకాలతో పాటు కారపూస, చెక్కలు వంటి కారం వంటకాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఇంతకీ మీకు నచ్చిన పిండి వంటకం ఏంటి. COMMENT చేయండి.
News January 15, 2026
కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎగ్జామ్ లేదు. కేవలం విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.coalindia.in/
News January 15, 2026
క్యారెట్ సాగు – కీలక సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని జనవరి వరకు నాటుకోవచ్చు. ఈ పంటలో నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.


