News August 17, 2024
మీ ఆధార్‌కు ఏ ఫోన్ నంబర్ ఇచ్చారు?
☞ UIDAI సైటులో మై ఆధార్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి
☞ అనంతరం వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి
☞ ఆ తర్వాత ఆధార్, మొబైల్ నంబర్, క్యాప్చా టైప్ చేసి, ఎంటర్‌పై క్లిక్ చేయాలి
☞ ఎంటర్ చేసిన నంబర్ ఆధార్‌కు లింకై ఉంటే అయినట్లు సందేశం వస్తుంది. లేదంటే లింక్ కాలేదని డిస్‌ప్లే అవుతుంది.
☞ ఇలా మీ వద్ద ఉన్న నంబర్‌లలో దేనికి ఆధార్ కార్డ్ లింకై ఉందో తెలుసుకోవచ్చు
Similar News
News September 13, 2024
బెండనీటితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!
రాత్రంతా బెండకాయలు నానబెట్టిన నీరు తాగితే బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించగలదు. వేగంగా కలిసిపోయే ఫైబర్ వల్ల డైజెషన్ మెరుగవుతుంది. పొట్ట, బరువు తగ్గేందుకు సాయపడుతుంది. యాంటీ యాక్సిడెంట్లతో కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం బాగుంటుంది. విటమిన్ ఏ, సీ వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి చర్మం నిగారిస్తుంది.
News September 13, 2024
సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ బ్యాటింగ్.. 7 బంతుల్లో డకౌట్
అసలే సెలక్టర్లు కోపంతో ఉన్నారని వార్తలు. దీనికి తోడు ఫామ్‌లేమి. పైగా సన్‌గ్లాసెస్ ధరించి క్రీజులోకి వచ్చారు. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడారా అంటే అదీ లేదు. జస్ట్ 7 బంతులాడి డకౌటయ్యారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-డి తరఫున శ్రేయస్ అయ్యర్ తాజా ప్రదర్శన తీరిది. ఇంకేముందీ నెటిజన్లు రంగంలోకి దిగి ట్రోలింగ్ మొదలెట్టారు. సైట్ ఇష్యూస్ ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకుంటారు గానీ సన్‌గ్లాసెస్ కాదు.
News September 13, 2024
ఈ వివాదానికి రేవంతే కారణం: హరీశ్ రావు
TG: కౌశిక్ రెడ్డి-గాంధీ వివాదానికి ముఖ్య కారకుడు CM రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘CM బజారు మాటలు మాట్లాడుతున్నారు. ఆయనలాగే గాంధీ, దానం వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ వివాదం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఈ మొత్తం వివాదం రేవంత్ డైరెక్షన్‌లోనే జరుగుతోంది’ అని మండిపడ్డారు.