News June 4, 2024
అమరావతి ఓటు ఎటువైపు?

AP: రాజధాని అమరావతి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లా గుంటూరు. ఇటు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో సైతం రాజధాని ప్రభావం కనిపిస్తోంది. రెండు జిల్లాల్లో మొత్తం 33(గుంటూరు 17, కృష్ణా 16) నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరులో YCP 15, TDP 2 స్థానాల్లో, ఉమ్మడి కృష్ణాలో YCP 15 గెలిస్తే, TDP ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. మరి ఈసారి రాజధాని అంశంతో తమకు ఎక్కువ సీట్లు రావొచ్చని టీడీపీ లెక్కలు వేస్తోంది.
Similar News
News September 14, 2025
నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
News September 14, 2025
రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం: చంద్రబాబు

AP: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి సాధించినట్లు CM చంద్రబాబు వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్పై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్ను విశ్లేషిస్తున్నామన్నారు. 2029నాటికి రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యంగా పనిచేయాలన్నారు.
News September 14, 2025
మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.