News July 2, 2024

3న అమరావతిపై శ్వేతపత్రం

image

AP: కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలవరంపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 3వ తేదీన అమరావతిపై ఈ పత్రాన్ని సీఎం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు. దీనిపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు పొందుపర్చాల్సిన అంశాలపై సూచనలు చేశారు.

Similar News

News September 20, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. వారిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ USలో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించామని, శ్రవణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు.

News September 20, 2024

బెంగాల్ X ఝార్ఖండ్: సరిహద్దు మూసేసిన మమత

image

ఝార్ఖండ్ సరిహద్దును మూసేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వల్ల 5 లక్షల క్యూసెక్కుల వరద సౌత్ బెంగాల్లోని 11 జిల్లాలను ముంచేసిందని ఆమె ఆరోపించారు. DVC ఎప్పుడూ ఝార్ఖండ్ గురించే ఆలోచిస్తోందని, దాంతో సంబంధాలు తెంపుకుంటున్నామని ప్రకటించారు. ‘ఆమెదో విపరీత చర్య. బెంగాల్‌కు ధాన్యం తెచ్చే ట్రక్కులను మేమూ ఆపేస్తాం’ అని JMM హెచ్చరించింది.

News September 20, 2024

లడ్డూ వ్యవహారం ఎవరూ ఊహించనిది: ప్రణిత

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై నటి ప్రణితా సుభాష్ స్పందించారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వులు వినియోగించడం వేంకటేశ్వరస్వామి భక్తులు ఊహించలేని విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. అటు ఇదే వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.