News September 13, 2024

తొలి మంకీపాక్స్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి

image

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ కట్టడికి WHO తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బవేరియన్ నార్డిక్ సంస్థ తయారుచేసిన MVA-BN వ్యాక్సిన్‌‌ను వాడొచ్చని తెలిపింది. అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతవారం మంకీపాక్స్‌తో 107 మంది మరణించగా 3,160 కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపింది.

Similar News

News November 29, 2025

క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

image

ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

News November 29, 2025

ఈ ఫైనాన్స్ జాబ్స్‌‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

image

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్‌లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.

News November 28, 2025

ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్‌డేట్ చేసుకోండి!

image

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్‌ను<<>> అప్‌డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్‌లో ‘Aadhaar’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్‌డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్‌డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.