News September 13, 2024

తొలి మంకీపాక్స్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి

image

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ కట్టడికి WHO తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బవేరియన్ నార్డిక్ సంస్థ తయారుచేసిన MVA-BN వ్యాక్సిన్‌‌ను వాడొచ్చని తెలిపింది. అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతవారం మంకీపాక్స్‌తో 107 మంది మరణించగా 3,160 కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపింది.

Similar News

News October 10, 2024

KCRను దెయ్యం అని తెలంగాణ ద్రోహులే అంటారు: హరీశ్

image

TG: CM రేవంత్ అందజేసిన డీఎస్సీ నియామకపత్రాలు కేసీఆర్ చలవేనని హరీశ్ రావు అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే తెలంగాణను అమ్మేసేవారని, కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కాబట్టే ఇవాళ రేవంత్ సీఎం అయ్యారని చెప్పారు. KCRను దెయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవరూ అనరని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి ఇవాళ టీచర్లకు నీతివాక్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

News October 9, 2024

PHOTO: ‘సార్ పుణ్యమా అంటూ DSCలో జాబ్ వచ్చింది’ అని దండం

image

TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

News October 9, 2024

కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!

image

కేంద్రం 2020లో 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్‌స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్‌ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.