News January 4, 2025
లక్షలు సంపాదించే పానీపూరీ భయ్యాలు ఎందరున్నారో..!

డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు అసంఘటిత రంగంలో పెనుమార్పుకు కారణమవుతున్నాయి. ఉద్యోగుల CTC రూ.7లక్షలు దాటితే కంపెనీలు TDS కట్‌చేస్తాయి. TAX చెల్లించగా మిగిలిన మొత్తం రాబట్టుకొనేందుకు ITR ఫైల్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో పానీపూరీ, టిఫిన్స్, ఇతర సరుకులు అమ్మేవాళ్ల ఆదాయం రూ.10లక్షలు మించినా TDS లేదుకాబట్టి IT కట్టేవాళ్లు కాదు. ఆన్‌లైన్ పేమెంట్లతో వారి ఆర్జనా సామర్థ్యమేంటో తెలియడంతో IT, GST కంటపడుతున్నారు.
Similar News
News January 24, 2026
BCB కంప్లైంట్.. తిరస్కరించిన DRC

భారత్‌లో T20 WC ఆడేది లేదని తేల్చి చెప్పిన BCB నిన్న ICC వివాద పరిష్కార కమిటీ(DRC)ని ఆశ్రయించింది. INDలో ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది. అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.
News January 24, 2026
ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 24, 2026
‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్‌లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.


