News January 4, 2025

లక్షలు సంపాదించే పానీపూరీ భయ్యాలు ఎందరున్నారో..!

image

డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు అసంఘటిత రంగంలో పెనుమార్పుకు కారణమవుతున్నాయి. ఉద్యోగుల CTC రూ.7లక్షలు దాటితే కంపెనీలు TDS కట్‌చేస్తాయి. TAX చెల్లించగా మిగిలిన మొత్తం రాబట్టుకొనేందుకు ITR ఫైల్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో పానీపూరీ, టిఫిన్స్, ఇతర సరుకులు అమ్మేవాళ్ల ఆదాయం రూ.10లక్షలు మించినా TDS లేదుకాబట్టి IT కట్టేవాళ్లు కాదు. ఆన్‌లైన్ పేమెంట్లతో వారి ఆర్జనా సామర్థ్యమేంటో తెలియడంతో IT, GST కంటపడుతున్నారు.

Similar News

News January 17, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.

News January 17, 2025

బీదర్ దొంగల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

image

<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్‌పూర్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్ గంజ్‌లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

News January 17, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’: మూడు రోజుల్లో రూ.106 కోట్లు

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.