News June 19, 2024
టీడీపీ ఎమ్మెల్యేల్లో సీనియర్లు ఎవరంటే?
త్వరలో కొలువుదీరనున్న 16వ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు(9సార్లు) సీనియర్ మోస్ట్ లీడర్‌గా ఉంటారు. ఆయన తర్వాత గోరంట్ల బుచ్చయ్య (7సార్లు), అయ్యన్నపాత్రుడు(7), అచ్చెన్నాయుడు(6), ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(6), నంద్యాల వరదరాజులు రెడ్డి(6), ఆనం రామనారాయణ రెడ్డి(6), కన్నా లక్ష్మీనారాయణ(6), కిమిడి కళా వెంకట్రావు(5), గొట్టిపాటి రవి కుమార్ (5), పయ్యావుల కేశవ్(5సార్లు) సీనియర్లుగా ఉన్నారు.
Similar News
News September 19, 2024
ల్యాప్‌టాప్ వినియోగంతో సంతానోత్పత్తిపై ప్రభావం
ఉద్యోగాల పేరుతో గంటల తరబడి యువకులు ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. అయితే, ఇది ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశ్రాంతి తీసుకోకుండా ల్యాప్‌టాప్ వినియోగించడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మీ ఒడిలో ల్యాప్‌టాప్, మొబైల్స్ పెట్టుకొని వాడటం వల్ల మరింత హానికరమని తెలిపారు. ఇవి విద్యుదయస్కాంత క్షేత్రాలను విడుదల చేయడం వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందని చెప్పారు.
News September 19, 2024
త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
TG: త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి ముగ్గు పోస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో 53శాతం ఇళ్లకు మంచినీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని, వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామని వరంగల్‌లో అన్నారు.
News September 19, 2024
పవర్ కోసం కాదు.. పవన్ కోసం వస్తున్నా: బాలినేని
AP:YCPలో జరిగిన అవమానాలకు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏ పదవులు ఆశించడం లేదు. పవన్ రమ్మన్నారు. జనసేనలో చేరుతున్నా. జగన్ కోసం నా సొంత ఆస్తులు పోగొట్టుకున్నా. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా YCPని వీడలేదు. ఏ ఒక్క సమావేశంలోనూ జగన్ నా గురించి మంచిగా మాట్లాడలేదు. పదవుల కంటే గౌరవం ముఖ్యం’ అని ఆయన తెలిపారు.