News March 13, 2025
విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో?: అమర్‌నాథ్

AP: వైసీపీ అధినేత జగన్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన <<15734998>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ‘విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో? ఒకరిపై ప్రేమ పుడితేనే మరొకరిపై మనసు విరుగుతుంది. జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవారా? విజయసాయి వ్యవసాయం చేయరని, రాజకీయం మాత్రమే చేస్తారని నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News March 24, 2025
క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
News March 24, 2025
దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్‌ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్‌లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.
News March 24, 2025
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.