News April 29, 2024
ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పైచేయి ఎవరిదో?

ఏపీలో 29 ఎస్సీ, 7 ఎస్టీ అసెంబ్లీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. పార్టీల గెలుపోటముల్లో ఇవి కీలకంగా మారుతున్నాయి. 2014లో YCP 13 SC, ఆరు ST స్థానాల్లో నెగ్గింది. TDP 16 ఎస్సీ, ఒక్క ST సీటులో నెగ్గింది. 2019లో SC, ST నియోజకవర్గాలను YCP దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. 27 ఎస్సీ, మొత్తం 7 ఎస్టీ సీట్లలో గెలిచింది. 2 ఎస్సీ స్థానాల్లో TDP(కొండెపి), జనసేన(రాజోలు) నెగ్గాయి.<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.
News January 21, 2026
APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<
News January 21, 2026
మొబైల్ లేకున్నా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో మొబైల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్లో 32 మంది మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్/ల్యాప్టాప్లో ఏ అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోకుండానే కాల్స్లో కనెక్ట్ కావచ్చు. వాట్సాప్ వెబ్ యూజర్లకు 2 వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


