News April 2, 2025
భారత రిచెస్ట్ ఉమెన్ ఎవరంటే?

ఫోర్బ్స్-2025 ప్రకారం OP జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్($35.5 బిలియన్లు) భారత రిచెస్ట్ ఉమెన్‌గా నిలిచారు. ఓవరాల్‌గా IND టాప్-10 బిలియనీర్లలో సావిత్రి ఒక్కరే మహిళ కావడం విశేషం. తొలి స్థానంలో అంబానీ($92.5 బి.), రెండో స్థానంలో అదానీ($56.3 బి.), మూడో ప్లేస్‌లో సావిత్రి ఉన్నారు. ఆమె భర్త ఓంప్రకాశ్ స్థాపించిన జిందాల్ గ్రూప్ స్టీల్, విద్యుత్, సిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు విస్తరించింది.
Similar News
News April 24, 2025
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు: బీసీసీఐ

ఇకపై భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఉండబోవని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. IND, PAK మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ICC టోర్నీల్లో మాత్రమే IND, PAK తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News April 24, 2025
గేమ్ ఛేంజర్ అందుకే ఫ్లాప్ అయింది: కార్తీక్ సుబ్బరాజ్

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన రామ్ చరణ్ ’గేమ్ ఛేంజర్’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అందుకు గల కారణాన్ని తమిళ డైరెక్టర్, ఆ మూవీ కథ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను శంకర్‌కు చెప్పాను. కానీ తర్వాత స్టోరీని పూర్తిగా వేరేలా మార్చారు. కొత్త రైటర్లు చాలామందిని తీసుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే సమూలంగా కొత్త సినిమాను తలపించాయి’ అని పేర్కొన్నారు.
News April 24, 2025
వరంగల్‌లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

TG: వరంగల్‌లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.