News December 8, 2024

కేసీఆర్ వారసుడెవరు? కేటీఆర్ సమాధానమిదే

image

TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి KCRను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2025

స్టార్ హీరోపై కత్తి దాడి.. అరెస్టైన నిందితుడు ఇతడే!

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే పోలీసులు <<15190207>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ఫొటో వెలుగులోకి వచ్చింది. అతడిని పట్టుకున్నట్లు RPF పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్‌కి సమాచారం ఇచ్చారు. అతడి పేరు ఆకాశ్ కనోజియాగా గుర్తించారు. దీంతో ముంబై అధికారులు వీడియో కాల్ చేసి నిందితుడిని చూశారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరారు. నిందితుడిని ముంబై తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేయనున్నారు.

News January 18, 2025

రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: KTR

image

TG: బ్యాంకులో రైతు దేవ్‌రావ్ <<15189347>>ఆత్మహత్యకు<<>> ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేయకపోవడం వల్లే ఆయన బలవన్మరణం చెందారని అన్నారు. పదేళ్లు రాజుగా బతికిన రైతన్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలవుతున్నాడని వాపోయారు. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే రైతాంగం భావిస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News January 18, 2025

‘డాకు మహారాజ్’ కలెక్షన్లు @రూ.124+కోట్లు

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ చిత్రం కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే రూ.124+కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్ బస్టర్.. కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేడు, రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.