News October 4, 2024

ఎవరు పెద్ద హీరో?.. సురేశ్ బాబు సమాధానమిదే

image

టాలీవుడ్‌లో బిగ్ స్టార్ ఎవరు? అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘కలెక్షన్ల ఆధారంగా హీరోల స్థాయిని నిర్ణయించలేం. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏంతీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. వారి సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేదు. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామంది ఉన్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 13, 2024

విక్కీ కౌశల్ పరశురాముడిగా ‘మహావతార్’!

image

స్త్రీ, భేడియా వంటి సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు అమర్ కౌశిక్ పరశురాముడి కథతో ‘మహావతార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీస్తున్నామని, 2026 క్రిస్‌మస్‌కు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ తెలిపింది. పూర్తిగా పురాణ గాథలా కాకుండా ఆధునిక కాలానికి, పరశురాముడి కథకు లింక్ ఉండేలా స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం.

News November 13, 2024

స్టాక్‌మార్కెట్‌లోకి స్విగ్గీ.. స్వాగతించిన జొమాటో

image

స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన స్విగ్గీని దాని పోటీ సంస్థ జొమాటో స్వాగతించింది. ‘యూ అండ్ ఐ.. ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా స్విగ్గీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశానికి కలిసి సేవ చేయడంలో ఇంతకంటే మంచి సంస్థను ఊహించలేం’ అని వ్యాఖ్యానించారు. కాగా GMP సూచించిన దానికంటే ఎంతో మెరుగ్గా స్విగ్గీ ఐపీఓ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.

News November 13, 2024

పోలీసులకు అంబటి సవాల్.. ఆ తర్వాత

image

AP: హోంమంత్రి అనితపై అసభ్య పోస్టులు పెట్టిన YCP కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్ తమ ఆఫీస్‌లోనే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి సవాల్ విసరడంతో పోలీసులు నేరుగా వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.