News September 13, 2024

ఎర్రదళాన్ని నడిపించే కొత్త సారథి ఎవరో?

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో పార్టీ నూతన సారథిపై చర్చ నడుస్తోంది. 1964లో పార్టీ ఏర్పాటైన తర్వాత పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే తొలిసారి. కాగా త్వరలోనే పార్టీ అగ్రనేతలు సమావేశమై తదుపరి కార్యదర్శి ఎంపికపై చర్చిస్తారని తెలుస్తోంది. బెంగాల్ CPM కార్యదర్శి మహమ్మద్ సలీం, కేరళ CPM కార్యదర్శి ఎంవీ గోవింద్, త్రిపుర మాజీ CM మాణిక్ సర్కార్ పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 25, 2025

ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

image

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్‌టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.

News November 25, 2025

మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.