News September 13, 2024

ఎర్రదళాన్ని నడిపించే కొత్త సారథి ఎవరో?

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో పార్టీ నూతన సారథిపై చర్చ నడుస్తోంది. 1964లో పార్టీ ఏర్పాటైన తర్వాత పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే తొలిసారి. కాగా త్వరలోనే పార్టీ అగ్రనేతలు సమావేశమై తదుపరి కార్యదర్శి ఎంపికపై చర్చిస్తారని తెలుస్తోంది. బెంగాల్ CPM కార్యదర్శి మహమ్మద్ సలీం, కేరళ CPM కార్యదర్శి ఎంవీ గోవింద్, త్రిపుర మాజీ CM మాణిక్ సర్కార్ పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం.

Similar News

News October 10, 2024

టాటా కార్లు.. ప్రయాణికుల భద్రతే ప్రధానం

image

ఎన్నో రంగాలకు విస్తరించినా ‘టాటా’ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కార్లే. టాటా ఇండికా మొదలుకొని, నానో వరకు ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది. అందులో రతన్ టాటా కృషి ఎనలేనిది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు టాటా అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదటి 5/5 రేటింగ్ సాధించిన కారు టాటా నెక్సాన్. దీని సృష్టికర్త రతన్‌ టాటానే.

News October 10, 2024

టాటా మరణంపై మమత ట్వీట్: మొసలి కన్నీరు వద్దన్న నెటిజన్స్

image

రతన్ టాటా మరణం భారత వ్యాపార రంగానికి తీరని లోటన్న బెంగాల్ CM మమతా బెనర్జీ ట్వీటుపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. సింగూరులో టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నానో’ను అడ్డుకొని ఇప్పుడు మొసలి కన్నీరు ఎందుకంటూ నిలదీస్తున్నారు. ‘మీ వల్ల టాటాకు చాలా నష్టమొచ్చింది. ఇక చాలు’, ‘సింగూరు నుంచి టాటా వెళ్లిపోయినప్పుడే నువ్వు ఓడిపోయావ్’, ‘మీ రాజకీయ వృద్ధి కోసం సింగూరు అభివృద్ధిని అడ్డుకున్నారు’ అని కామెంట్స్ పెడుతున్నారు.

News October 10, 2024

ఒక్క ఓటమి.. కాంగ్రెస్‌పై మారిన ‘INDIA’ పార్టీల స్వరం

image

హరియాణాలో ఓటమి తర్వాత INDIA కూటమి పార్టీల స్వరం మారింది. విజయాన్ని ఓటమిగా మార్చే కళను కాంగ్రెస్ నుంచి నేర్చుకోవచ్చని శివసేన UBT సెటైర్ వేసింది. EVMతోనే గెలుస్తారు, ఓడితే నిందిస్తారని ఒవైసీ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘అహంకారం, అధికారం జన్మహక్కన్న ఫీలింగ్’ అని TMC పరోక్షంగా విమర్శించింది. SP కనీసం కాంగ్రెస్‌ను అడగకుండా UP బైపోల్స్‌ అభ్యర్థుల్ని ప్రకటించింది. అంతర్మథనం చేసుకోండని CPI సలహా ఇచ్చింది.