News July 13, 2024

కొత్త ఛాంపియన్ ఎవరో?

image

వింబుల్డన్(టెన్నిస్) మహిళా సింగిల్స్‌లో ఇవాళ తుదిపోరు జరగనుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో క్రెజికోవా(చెక్ రిపబ్లిక్), పావోలిని(ఇటలీ) తలపడనున్నారు. వీరిద్దరు వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. క్రెజికోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలవగా, పావోలిని ఖాతాలో ఒక్క గ్రాండ్‌స్లామ్ లేదు. 2016లో సెరెనా ట్రోఫీ గెలిచాక ప్రతి వింబుల్డన్‌లోనూ కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నారు. ఈసారీ అదే ఆనవాయితీ కొనసాగుతోంది.

Similar News

News January 5, 2026

పాలకొల్లు: ఇంటికి వెళ్లడానికి 4 గంటలు ఉందనగా..

image

పాలకొల్లుకు చెందిన దంపతులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరడానికి మరో 4 గంటల సమయం ఉందనగా ఈ విషాదం జరిగింది. మృతులు కొటికలపూడి రాజమోహన్ రావు కుమారుడు, కోడలుగా గుర్తించారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని వచ్చి చూసి వెళ్తుండగా మృత్యువాత పడటంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.

News January 5, 2026

J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

image

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.

News January 5, 2026

IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

image

భారత్‌తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్‌కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్‌కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.